దివాకర్‌ ట్రావెల్స్‌పై ప్రజా పోరాటం!

7 Mar, 2017 00:35 IST|Sakshi

‘ప్రైవేటు బస్సు మాఫియాపై పోరాట సమితి’ పేరిట వేదిక ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్‌: కనీస ప్రమాణాలు లేకుండా, జాగ్ర త్తలు చేపట్టకుండా బస్సులను తిప్పుతున్న దివాకర్‌ ట్రావెల్స్‌ వంటి ప్రైవేటు ట్రావెల్స్‌ సంస్థలు, వాటికి అండగా నిలుస్తున్న ఏపీ సర్కారు తీరును ఎండగట్టేం దుకు ప్రజా పోరాటం మొదలవుతోంది. మూడున్నరేళ్ల క్రితం మహబూబ్‌నగర్‌ జిల్లా పాలెం శివారులో దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు దగ్ధమై 45 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. తాజాగా అదే ట్రావెల్స్‌ కు చెందిన బస్సు కాలువలో పడిపోయి 11 మంది దుర్మరణం పాలయ్యారు.

ఇలాంటి ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు, వాటికి అండగా నిలుస్తున్న ప్రభుత్వాలపై పోరాటం కోసం కొందరు బాధితులు, మరికొందరు కలసి ‘ప్రైవేటు బస్సు మాఫియాపై పోరాట సమితి’ పేరిట ఓ వేదికను ఏర్పాటు చేశారు. నిర్లక్ష్యంతో అమాయకులను బలితీసుకుంటున్న ట్రావెల్స్‌ను మూసివేయించడమే లక్ష్యంగా నిర్ణయించినట్టు ఈ వేదిక అధ్య క్షురాలు రేఖ పేర్కొంటున్నారు. పాలెం ఘటన బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా కృషి చేసిన సుధాకర్‌ ఈ వేదికకు గౌరవాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని వార్తలు