కండల రాణి

8 Mar, 2014 01:57 IST|Sakshi
కండల రాణి

 భారతదేశం పెద్ద పెద్ద బాడీబిల్డర్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కాని మహిళా బాడీబిల్డర్లు అప్పట్లో లేరు. అయితే, ఇప్పుడు
 మహిళల బాడీబిల్డింగ్‌లో రైజింగ్‌స్టార్ ఆవిర్భవించారు. ఆమే నగరవాసి కిరణ్ డెంబ్లా.

ఇటీవల హంగేరిలో జరిగిన ప్రపంచ  మహిళల బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లో 6వ స్థానాన్ని కైవసం చేసుకుని మనదేశంలోనూ మహిళా బాడీబిల్టర్లు ఉన్నారని చాటిచెప్పారు ఈ ఇద్దరు పిల్లల తల్లి. కండలక్వీన్‌గా మారి నగరంలో ఫిట్‌నెస్ ప్రపంచానికి సరికొత్త దారులు తెరిచారు. కేవలం మగవారే కాదు మగువలు కూడా ఫిట్‌నెస్ పరంగా అద్భుతాలు సృష్టించగలరని నిరూపించడంతోపాటు రకరకాల కారణాలతో
వ్యాయామానికి దూరమవుతున్న మహిళల్లో చైతన్యం తేవాలనేదే తన ప్రయత్నం అంటారు కిరణ్. యోగా కావచ్చు.. జాగింగ్ కావచ్చు.. ఏరోబిక్స్ కావచ్చు.. ఏదైనా సరే మహిళ తలచుకుంటే అగ్రస్థానంలో నిలవగలదని పేర్కొన్నారామె.
 

మరిన్ని వార్తలు