సాగులో సమూల మార్పులు

1 Feb, 2017 00:17 IST|Sakshi
  • ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వ్యవసాయం
  • కేంద్రం యోచన...రాష్ట్రాల అభిప్రాయాలు కోరుతూ నోట్‌
  • సాక్షి, హైదరాబాద్‌: సాగులో సమూల మార్పులు తెచ్చేందుకు కేంద్రం నడుంబిగించింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే దిశగా పలు చర్యలు చేపడుతోంది. ఈ రంగం వైపు యువతను ఆకర్షిం చేవిధంగా మార్పులు తీసుకురావాలని ప్రయత్ని స్తోంది. ప్రధానంగా వ్యవసాయంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిని ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్కేవీవై) పథకం లో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆర్కేవీవై పేరు ను ప్రధాన మంత్రి రాష్ట్రీయ కిసాన్‌ వికాస్‌ యోజన గా మార్పు చేయాలని భావిస్తోంది. అనేక కీలక మార్పులు చేసే ఈ పథకంపై రాష్ట్రాల అభిప్రా యాలు కోరుతూ కేంద్ర ప్రభుత్వం కాన్సెప్ట్‌ నోట్‌ను రాష్ట్రాలకు పంపించింది.

    యువతను ఆకర్షించేలా...: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతోపాటు యువతను ఆకర్షించే లక్ష్యంతో ఆర్కేవీవైని అధికారులు తీర్చిది ద్దనున్నారు. దీన్ని 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ హయాం లోనే అమలు చేయనున్నారు. కొత్త పద్దతుల్లో వ్యవసాయం చేసేందుకు యువతను, రైతులను, రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీవో)కు చేయూతని వ్వాలని భావిస్తున్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పేందుకు అవసర మైన నిధుల సమీకరణకు పీపీపీని అనుసరించాలని యోచిస్తు న్నారు. వచ్చే మూడేళ్లకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం తయారు చేసింది. నష్టాలు చవిచూసే పంటలను కాకుండా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు కలిగించే పంటలపై దృష్టి సారిస్తారు.

    50% నిధులు మౌలిక సదుపాయాల కోసమే...
    ఆర్కేవీవై నిధుల ఖర్చుపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఆహారధాన్యాలు, ఇతర పంటల ఉత్పత్తి, ఉత్పాదకత పెంచే మౌలిక సదుపా యాలకు 20% కేటాయిస్తారు. విత్తనం, భూసా రం, పురుగుమందులు, ఎరువుల నాణ్యత పరీక్షల లేబోరేటరీల ఏర్పాటుకు ఈ నిధులను ఉపయోగిస్తారు. పంట చేతికి వచ్చాక మార్కె టింగ్‌ మౌలిక సదుపాయాలకు 30, ప్రత్యేక పథకాల కోసం 20, వ్యవసాయ ఔత్సాహిక వేత్తలు, నైపుణ్య అభివృద్ధికి 8, అగ్రి బిజినెస్‌ ద్వారా అదనపు ఆదాయం కోసం 20%, పరి పాలనా ఖర్చులకు 2% చొప్పున కేటాయిస్తారు. వీటన్నింటిలో 25 నుంచి 30% నిధులను పశుసంవర్థకశాఖకు కేటాయిస్తారు.

మరిన్ని వార్తలు