ఎంపీ కవితపై కేసు కొట్టివేత

25 Jan, 2017 14:05 IST|Sakshi
ఎంపీ కవితపై కేసు కొట్టివేత
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో మౌలాలిలో జరిగిన రైల్ రోకో కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో మద్దుయిగా ఉన్న ఎంపీ కవిత బుధవారం రైల్వే కోర్టుకు హాజరయ్యారు. కేసును విచారించిన కోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.
 
అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతోందని, అయితే ప్రతిపక్షాలు మాత్రం అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉత్సవాలకు సిద్ధమవుతుంటే శకునంలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి రాహుల్ గాంధీని పిలుస్తున్నారని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ పేరును రాహుల్ రుడాల్ గాంధీగా మార్చుకోవాలని చెప్పారు. 
 
 
 

 

>
మరిన్ని వార్తలు