రైల్వే ఉద్యోగిని బ్యాగ్ మాయం

16 Jun, 2016 20:14 IST|Sakshi

రైలులో ప్రయాణిస్తున్న టీటీఈ(టికెట్ తనిఖీ అధికారి) హ్యాండ్ బ్యాగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టేశారు. వివరాలివీ... సికింద్రాబాద్ రైల్వే టీటీఈ అనిత కుమారి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం అనంతపురం నుంచి బెంగుళూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో హైదరాబాద్ బయలుదేరారు. కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమె బ్యాగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు.

దీనిపై బాధితురాలు గురువారం కాచిగూడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన బ్యాగులో 12 గ్రాముల బంగారు గొలుసు, రూ.9వేల నగదు, ఏటీఎం కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్ ఉన్నాయని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ ఆదిరెడ్డి తెలిపారు.

 

మరిన్ని వార్తలు