యుద్ధప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ

16 Sep, 2016 06:15 IST|Sakshi
యుద్ధప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ

సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో వికారాబాద్-సదాశివపేట మధ్య రైల్వే ట్రాక్ దిగువ కంకర కొట్టుకుపోయిన మార్గాన్ని రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించారు. బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురవటంతో వికారాబాద్-పర్లీ మార్గంలో సదాశివపేట-వికారాబాద్ మధ్య ట్రాక్ దెబ్బతిన్నది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేసిన అధికారులు... ముద్ఖేడ్-నిజామాబాద్ మార్గంలోకి మళ్లించారు. షిర్డీ-విజయవాడ, పుణె-హైదరాబాద్, ఔరంగాబాద్-హైదరాబాద్ రైళ్లను మళ్లించారు. రంగంలోకి దిగిన అధికారులు... ట్రాక్‌కు మరమ్మతులు చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. జీఎం రవీంద్రగుప్తా పర్యవేక్షణలో 200 మంది సిబ్బంది, భారీ హిటాచీ యంత్రాలను రంగంలోకి దింపి ట్రాక్‌ను సిద్ధం చేశారు.

హైదరాబాద్-కొచువెళ్లి మధ్య మరో సర్వీసు...
రద్దీ నేపథ్యంలో హైదరాబాద్-కొచువెళ్లి మధ్య మరో సర్వీసు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నెల 24న హైదరాబాద్‌లో రాత్రి 9 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు కొచువెళ్లికి 26 ఉదయం 3.20కి చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో కొచువెళ్లిలో 26 రాత్రి 8.15కి బయలుదేరి 28 ఉదయం నగరానికి చేరుకుంటుందన్నారు. నల్లగొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కట్పడి, అంబూరు, వనియంబాడిల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది.

మరిన్ని వార్తలు