వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు

26 Jun, 2016 03:13 IST|Sakshi

హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి 

రామన్నపేటలో 8 సెంటీమీటర్ల వర్షం
 
 సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ప్రస్తుతమున్న ఉపరితల ఆవర్తనం 24 గంటల్లో బలపడి అల్పపీడనంగా మారనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో రుతుపవనాలు  వేగం పుంజుకుంటాయని పేర్కొంది. వచ్చే రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.  శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో చాలాచోట్ల భారీ వర్షాలు కురిశాయి.

నల్లగొండ జిల్లా రామన్నపేటలో  8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా జుక్కల్‌లో 7, పిట్లంలో 6, రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో 4 సెంటీమీటర్ల  వర్షం కురిసింది. మరోవైపు హైదరాబాద్‌లో శనివారం రాత్రి పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.  హైదరాబాద్‌లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు