'గాలివాన బీభత్సానికి 300 చెట్లు నేలకొరిగాయి'

21 May, 2016 10:49 IST|Sakshi

హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్లో శుక్రవారం సాయంత్రం 100 కి.మీ వేగంతో గాలులు వీచాయని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. శనివారం హైదరాబాద్లో కమిషనర్ జనార్దన్రెడ్డి మాట్లాడుతూ... గాలి వాన బీభత్సానికి 300 చెట్లు నేలకొరిగాయని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ సహాయం తీసుకున్నామన్నారు.

అలాగే ట్రాఫిక్ను పునరుద్ధరించామని తెలిపారు. ఈ గాలివానకు ఇద్దరు చనిపోయారని... మరికొందరికి గాయాలయ్యాయని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు