రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ

31 May, 2016 11:06 IST|Sakshi

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ను మంగళవారం ఉదయం అధికారులు విడుదల చేశారు. తెలంగాణలో 2, ఏపీలో 4 రాజ్యసభ సీట్లకు ఎన్నిక జరగనుంది. నేటి నుంచి మే31  వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ 11న ఎన్నిక జరుగును. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరుపుతారు.

దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు చెందిన 57 సీట్లకు ఎన్నిక జరుగును. పదవీ విరమణ చేస్తున్న వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్(బీజేపీ), జైరాం రమేశ్, జేడీ శీలం(కాంగ్రెస్), సుజనా చౌదరి(టీడీపీ),  తెలంగాణ నుంచి గుండు సుధారాణి(ప్రస్తుతం టీఆర్‌ఎస్), వి.హనుమంతరావు( కాంగ్రెస్) ఉన్నారు. వీరితో పాటు కర్ణాటక నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడి పదవీకాలం జూన్ 30తో పూర్తవుతుంది.

మరిన్ని వార్తలు