చిన్నబోయిన సినీ లోకం

20 Feb, 2015 00:30 IST|Sakshi

రామానాయుడి మృతితో ఫిలింనగర్, సినీవిలేజ్‌లో విషాదం
 
రాయదుర్గం: మూవీమొగల్ రామానాయుడు మృతితో నానక్‌రాంగూడలోని సినీ విలేజ్, జూబ్లీహిల్స్‌లోని ఫిలింనగర్ గురువారం మూగ బోయాయి. ఆయన మృతికి సంతాప సూచకంగా షూటింగ్‌లు నిలిపివేసి బంద్ పాటించడంతో సినీ విలేజ్ ప్రాంగణం బోసి పోయింది. 1994లో రామానాయుడు ఔట్ డోర్ షూటింగ్‌ల కోసం ప్రత్యేకంగా ఖాజాగూడ-నానక్‌రాంగూడ మధ్యన భగీరథ చెరువు సమీపంలో సినీ విలేజ్ ఏర్పాటు చేశారు. సినిమాలకు చెందిన ఔట్ డోర్ షూటింగ్‌లను ఇక్కడ నిర్వహిస్తుండడంతో ఎప్పుడు సినీ కళాకారులతో ఈ ప్రాంతం కిటకిటలాడుతుంటోంది. గత 20 ఏళ్లుగా ఆయున వారంలో కనీసం రెండు సార్లయినా ఇక్కడి వచ్చి పరిసరాలు, చెట్లు, మొక్కలు పరిశీలించి, సిబ్బందికి అవసరమైన సూచనలు చేసేవారని ఉద్యోగులు తెలిపారు.

 రామానాయుడి మృతికి సంతాపం...

 రామానాయుడు మృతితో నిశ్చేష్టులైన ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది ప్రధాన గేటు వద్ద  రామానాయుడు చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దీంతోపాటు స్టూడియో ముందున్న ఔటర్ రింగు రోడ్డు సర్కిల్ వద్ద ఉన్న రోడ్డు పక్కన నాగదేవత గుడి ముందు భారీ చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేశారు.  
 
కళతప్పిన కృష్ణానగర్


సినీ కార్మికుల ఆరాధ్య దైవంగా వెలుగుతున్న మూవీ మొఘల్ రామానాయుడు మృతితో కృష్ణానగర్, ఫిలింనగర్, ఇందిరానగర్ ప్రాంతాలు శోకసంద్రంలో మునిగిపోయూరుు. నిత్యం సినీ కార్మికులతో కిటకిటలాడే ఈ ప్రాంతాలు గురువారం నిర్మానుష్యంగా మారాయి. ప్రతి యూనియన్ కార్యాలయం ముందు రావూనాయుుడు చిత్రపటాలు ఏర్పాటు నివాళులర్పించారు. యూనియన్ కార్యాలయాలు మూసివేశారు. షూటింగ్‌లో నిలిపివేశారు. థియేటర్లను కూడా వుూసివేసి సినీ కార్మికులంతా రామానాయుడు స్టూడియో దారి పట్టారు. తమ అభిమాన నిర్మాత ఇకలేరన్న విషయాన్ని తలుచుకొని మహిళా కార్మికులు కంటతడిపెట్టారు.   
 
సంతాపం

బహుభాషా సినీ నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు మృతికి తీవ్ర సంతాపాన్ని తెలుపుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు ఏపీ చిల్ట్రన్స్ ఫిల్మ్ సొసైటీ చైర్మన్ వేదకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రామానాయుడు మృతి తెలుగు సినీపరిశ్రమకు తీరనిలోటని పేర్కొన్నారు.
 
పెద్ద సార్‌తో 18 ఏళ్ల అనుబంధం

పెద్ద సార్‌తో 18 ఏళ్ల అనుబంధం ఉందని నానక్‌రాంగూడలోని రామానాయుడు సినీ విలేజ్  సెక్యూరిటీ గార్డు ఎస్ కె సింగ్ గద్గద స్వరంతో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి 18 ఏళ్ల క్రితం వలస వచ్చి సెక్యూరిటీ గార్డుగా చేరానన్నాడు. ఇక్కడ పనిచేసే అయిదుగురు సెక్యూరిటీ సిబ్బంది, ఇతర ఉద్యోగులను ఆప్యాయుంగా పలకరించేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.     -ఎస్.కె.సింగ్, సెక్యూరిటీ గార్డు
 

మరిన్ని వార్తలు