‘స్నేక్‌గ్యాంగ్’ అకృత్యాలపై నేడు తీర్పు

10 May, 2016 08:44 IST|Sakshi

రంగారెడ్డి జిల్లా కోర్టులు (హైదరాబాద్‌సిటీ): నగరంలో పలు అత్యాచారాలు పాల్పడిన స్నేక్ గ్యాంగ్‌పై రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం తుది తీర్పు ఇవ్వనున్నది. 2014 జులై నెలలో నగర శివారు ప్రాంతంలోని పహాడీషరీప్‌లో పాముతో బెదిరించి ఓ యువతి పై స్నేక్ గ్యాంగ్ సామూహిక అత్యాచారం చేసింది. బాధిత యువతి ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన పోలీసులు ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు.

ఈ కేసులో నిందితులు దయాని, ఖాదర్ బరాక్బ, తయ్యబ్ బసలమ, మహమ్మద్ పర్వేజ్, సయద్ అన్వర్, ఖజా అహ్మద్, మహమ్మద్ ఇబ్రహీం, అలీ బరాక్బ, సలామ్ హాండిలపై కోర్టు అభియోగ పత్రాలను పోలీసుల దాఖలు చేశారు. ఇందులో ఏడుగురు చర్లపల్లి జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్నారు. మరో ఇద్దరు బెయిల్‌పై ఉన్నారు. పాములతో బెదిరించి 37 మంది అకృత్యాలకు పాల్పడిన ఈ స్నేక్‌గ్యాంగ్ కేసును విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం తీర్పు ఇవ్వనున్నది.

మరిన్ని వార్తలు