బాలికను గర్భవతి చేసిన కామాంధుడి అరెస్ట్

4 Jan, 2016 22:51 IST|Sakshi

మాదాపూర్: హైదరాబాద్‌లో బాలికను గర్భవతి చేసిన కామాంధుడిని సోమవారం మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మాదాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక చందానాయక్ తాండాలో నివాసముంటోంది.

బాలికకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన దిలీప్ సర్కార్(39)తో పరిచయం ఏర్పడింది. దిలీప్ సర్కార్‌కు వివాహమై, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మాదాపూర్‌లో రెస్టారెంట్ నిర్వహించే అతడు బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను గర్భవతిని చేశాడు. దీంతో గత నవంబర్ 28న బాలిక ఆడ శిశువును ప్రసవించింది. అనంతరం దిలీప్ సర్కార్ పరారయ్యాడు. నిందితుడ్ని పోలీసులు కోల్‌కతాలో అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు. సోమవారం అతడిని రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు