'అందుకే గవర్నర్ పట్టించుకోవడం లేదు'

29 Mar, 2016 12:10 IST|Sakshi

హైదరాబాద్: విశ్వవిద్యాలయాలు ఆధునిక దేవాలయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని విశ్వవిద్యాలయాల చట్టాల పునర్నిర్మాణం అవసరమని భావించి కొన్ని మార్పులు సూచిస్తుందని చెప్పారు. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ చట్ట సవరణ బిల్లును తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఆ సవరణ బిల్లుకు మద్దతు తెలుపుతూ రసమయి ఈ విధంగా మాట్లాడారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు వర్సిటీల విషయంలో మంచి పరిజ్ఞానం ఉందని పేర్కొన్నారు. ఒకప్పుడు మేధావులను అందించిన వర్సిటీలు సమైక్య పాలనలో దెబ్బతిన్నాయని చెప్పారు. గవర్నర్ కు తక్కు వ సమయం ఉన్నందు వల్ల వర్సిటీలను పూర్తి స్థాయిలో పట్టించుకునే తీరిక లేకుండా పోయిందని వివరణ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ లో కూడా వీసీల నియామకం ప్రభుత్వం చేతిలో ఉందని గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు