పక్కదారి పడుతున్న రేషన్ సరుకులు

21 Jan, 2016 10:35 IST|Sakshi

పౌరసరఫరాల శాఖ పేదలకు పంపిణీ చేసే బియ్యంతోపాటు ఇతర సరుకులను అక్రమ మార్గంలో తరలిస్తున్న ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టుచేశారు. రాజధానిలో రేషన్ కిరోసిన్, పప్పులు, గోధుమలతోపాటు బియ్యాన్ని అక్రమ మార్గాల్లో సేకరించి విక్రయిస్తున్న 26 మందిని అదుపులోకి తీసుకున్నారు.
 వారిలో రేషన్ డీలర్లతోపాటు వ్యాపారులు, దళారులు, మిల్లర్లు ఉన్నారు. వీరి నుంచి 362 క్వింటాళ్ల బియ్యం, 500 క్వింటాళ్ల గోధుమలు, 630 లీటర్ల కిరోసిన్ స్వాధీనం చేసుకున్నారు. రెండు ట్రక్కులను సీజ్ చేశారు. అక్రమాలకు పల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు.


 

మరిన్ని వార్తలు