అభివృద్ధిపై శ్వేతపత్రం ఇవ్వాలి: రావుల

4 Jun, 2016 03:03 IST|Sakshi
అభివృద్ధిపై శ్వేతపత్రం ఇవ్వాలి: రావుల

సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల పాలనలో ఏవేవో సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం జరిగిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రె డ్డి డిమాండ్ చేశారు. ఎస్టీ, మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్ అమలు అడ్రస్ లేకుండా పోయిందని, తెలంగాణ అమరవీరుల చిరునామాలు కూడా కనుక్కోలేక పోయారని విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేవలం 231 కరువు మండలాలనే ప్రకటించి మిగిలిన మండలాల కష్టాలను పట్టించుకోక పోవడం సరికాదని అన్నారు. మిషన్ కాకతీయలో సబ్ కాంట్రాక్టులన్నీ టీఆర్‌ఎస్ నేతలవి కాదా? అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు