తగ్గిన ఖరీఫ్‌ వరి దిగుబడి

30 Jan, 2018 01:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఖరీఫ్‌లో వరి ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. 2017–18 ఖరీఫ్‌లో వరి ఉత్పత్తి లక్ష్యం 32.47 లక్షల టన్నులు కాగా, దిగుబడి 30.42 లక్షల టన్నులకు పడిపోయిందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రెండో ముందస్తు అంచనా నివేదిక విడుదల చేసింది. 2 లక్షల టన్నులకుపైగా వరి ఉత్పత్తి పడిపోవడం గమనార్హం. మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 54.60 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, కేవలం 50.29 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అంటే, 4 లక్షల టన్నుల మేర ఆహార ఉత్పత్తులు తగ్గాయి.

ఖరీఫ్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తి ఆశించిన మేర లేకపోవడంతో రబీపైనే ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. రబీలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 36.28 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, ఉత్పత్తి 44.72 లక్షల మెట్రిక్‌ టన్నులు అవుతుందని సర్కారు తాజా నివేదికలో అంచనా వేసింది. వరి ఉత్పత్తి లక్ష్యం 25.64 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, 35.16 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసింది. అయితే, రబీలో వరినాట్లు కేవలం 87 శాతానికే పరిమితం కావడం గమనార్హం. 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు