అడ్రస్ లేకుండా పోయారు.. గుర్తుంచుకోండి

19 Dec, 2015 10:03 IST|Sakshi
అడ్రస్ లేకుండా పోయారు.. గుర్తుంచుకోండి

అసెంబ్లీలో తమకున్న మందబలంతో ప్రతిపక్షం గొంతు నులిమేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. గతంలో ఇంతకంటే పెద్దవే చూశామని, తమిళనాడులో జయలలితను అవమానిస్తే, ఆ తర్వాత ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయారని గుర్తుచేశారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఆయనేమన్నారంటే..

  • రోజా పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అసమంజసం, అప్రజాస్వామికం
  • అసెంబ్లీ ఆవరణలోకి మాజీ ఎమ్మెల్యేలు కూడా రావచ్చు.
  • ఇటీవల ఓ టీడీపీ కార్పొరేషన్ చైర్మన్ మీడియా పాయింట్లో కూడా మాట్లాడారు
  • ముఖ్యమంత్రి నేరుగా మైకుల్లోనే అంతుతేలుస్తా అని మాట్లాడారు
  • అచ్చెన్నాయుడు, ఉమా, యనమల అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి నీచాతినీచంగా మాట్లాడారు
  • బోండా ఉమా అయితే అసెంబ్లీలోనే సమాధి కడతామన్నారు
  • బుచ్చయ్య చౌదరి అయితే రోజూ ఏం మాట్లాడతారో తెలియనిది కాదు
  • రోజాను సస్పెండ్ చేయాలంటే , ఆ నియమాలు సీఎంకు, మంత్రులకు వర్తించవా
  • మందబలంతో ప్రతిపక్షాన్ని గొంతు నులిమేస్తున్నారు
  • ప్రభుత్వం తమ దమననీతిని మానుకోవాలి
  • మమ్మల్నందరినీ మూడు నాలుగేళ్లు సస్పెండ్ చేసినా భయపడే ప్రశ్నే లేదు

మరిన్ని వార్తలు