'టీఆర్ఎస్ భయపడేది టీడీపీకే'

8 Sep, 2016 03:41 IST|Sakshi
'టీఆర్ఎస్ భయపడేది టీడీపీకే'

హైదరాబాద్: టీటీడీపీని వదలి టీఆర్ఎస్ లో చేరిన నాయకులంతా ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలోనే వారందరూ తిరిగి టీడీపీలోనే చేరతారని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఎంపీ మల్లారెడ్డి బావమరిది శ్రీనివాసరెడ్డి తిరిగి టీడీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మినహా మరే పార్టీకి టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి లేదని అన్నారు. టీడీపీ చేస్తున్న పనులను ఎమ్మెల్యే గోపీనాథ్ లాంటి వారు రహస్యంగా అభినందిస్తున్నారని తెలిపారు.

టీఆర్ఎస్ భయపడేది కూడా ఒక్క టీడీపీని చూసేనని వ్యాఖ్యానించారు. మల్లారెడ్డి ఒత్తిడితో టీఆర్ఎస్ లో చేరిన శ్రీనివాస రెడ్డి తిరిగి తెలుగుదేశం పార్టీలోకి రావడం శుభపరిణామమని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చెత్తనగరంగా మార్చారని ధ్వజమెత్తారు. మున్సిపల్ శాఖ మంత్రి పర్యటించినా నగరంలోని రోడ్ల దుస్ధితి మారలేదన్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు