విద్యుత్ కొనుగోళ్లలో భారీ కుంభకోణం

12 Nov, 2016 03:57 IST|Sakshi
విద్యుత్ కొనుగోళ్లలో భారీ కుంభకోణం

ప్రైవేట్ సంస్థలపై సీఎం కేసీఆర్‌కు ప్రేమ ఎందుకు?: రేవంత్

 సాక్షి, ఖమ్మం: ప్రైవేట్ విద్యుత్ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి సీఎం కేసీఆర్ భారీ కుంభకోణానికి పాల్పడ్డా రని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెం ట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఖమ్మంలో ఆయన విలేక రులతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం కృష్ణపట్నం, హిందూజా పవర్‌ప్లాంట్ల నుంచి తెలంగాణకు విద్యుత్ ఇస్తామన్నా.. ఈ విద్యుత్ వద్దని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిం దన్నారు. తెలంగాణద్రోహి లగడపాటి రాజగోపాల్‌కు చెందిన ల్యాంకో కంపెనీపై కేసీఆర్ ఎందుకు ప్రేమ కనబరిచారో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మణుగూరులో నిర్మిస్తున్న భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ విషయంలోనూ భారీగా అవినీతి చోటు చేసుకుందన్నారు.

కేంద్ర, గ్రీన్ ట్రిబ్యునల్, పర్యావరణ శాఖ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఇక్కడ విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తే పరిసర ప్రాంతాలకు ఇబ్బంది అవుతుందని చెప్పినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెట్టిందన్నారు. గుజరాత్ రాష్ట్ర విద్యుత్ కంపెనీ ఇండియాబుల్.. బీహెచ్‌ఈఎల్‌లో సబ్ క్రిటికల్ టెక్నా లజీకి సంబంధించిన యంత్రపరికరాలన్నీ కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. అరుుతే, ఈ కంపెనీ బొగ్గు కుంభకోణంలో ఇరుక్కోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న.. ఈ కంపెనీ సంస్థలపై కేసులు నమోదయ్యాయన్నారు. ఈ పరిస్థితితో ఆ కంపెనీతో కేసీ ఆర్ చీకటి ఒప్పందం చేసు కుని భారీగా అవినీతికి పాల్ప డ్డారని ఆరోపించారు.

ప్రైవేట్ విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన భారీ ఒప్పందాలపై ఎవరె వరు సంతకాలు పెట్టారు.. వారితోపాటు సీఎం కేసీఆర్‌ను  కూడా ప్రాసిక్యూట్ చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు సీబీఐ, సీవీసీతో విచారణ చేరుుంచాల న్నారు. ఇందుకు సంబంధించి అధికా రులతోపాటు సీఎం కేసీఆర్, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావులపై కేసు నమోదు చేయాలన్నారు. నిరంతర విద్యుత్ ముసుగులో కేసీఆర్ తోపాటు ఆయన కుటుంబం వేలకోట్ల కుంభకోణానికి పాల్పడుతోందన్నారు.

రిటైర్డ్ ఇంజనీరింగ్ అధికా రులను జెన్‌కో, ట్రాన్‌‌సకో, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్, సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ సంస్థల కు ఇన్ చార్జ్‌లుగా నియమించారని, సీనియర్ ఐఏఎస్ అధికా రులున్నా  కాటికి కాలు చాపిన వీరిని ఎందుకు నియమిం చాల్సి వచ్చిందని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, రాష్ట్ర నేతలు సీతక్క, వేం నరేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, మద్దినేని బేబి స్వర్ణకుమారి పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా