తెలంగాణ టీడీఎల్పీ కార్యాలయంపై వివాదం

5 Jul, 2016 13:01 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ టీడీఎల్పీ కార్యాలయంపై వివాదం నెలకొంది. తమకు నోటీసు ఇవ్వకుండానే కార్యాలయాన్ని ఇతరులకు కేటాయించటంపై  తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ పద్ధతి లేకుండా వ్యవహరించారని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. హక్కులను కాపాడాల్సిన స్పీకరే ఇలా చేయడం తగదని ఆయన అన్నారు.

స్పీకర్ ఈ విషయంలో నిబంధనలు పాటించలేదని, తాము ఖాళీ చేయకుండానే గదులను ఇతరులకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా జరుగుతున్న వ్యవహారంపై తాము కోర్టుకు వెళతామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ వ్యవహారాన్ని ఆయన కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారు. కాగా టీడీఎల్పీ కార్యాలయంను స్పీకర్ ఉమెన్స్ వెల్ఫేర్ కమిటీకి కేటాయించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు