వీడు సామాన్యుడు కాదు..!

6 Mar, 2016 10:06 IST|Sakshi
వీడు సామాన్యుడు కాదు..!

అంతర్రాష్ట్ర గొలుసు దొంగ అరెస్టు
 25 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
యూపీ నుంచి వచ్చి చోరీలు
నలుగురితో ముఠా ఏర్పాటు
పరారీలో మరో ముగ్గురు నిందితులు

 
అత్తాపూర్: వరుస చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతరాష్ట్ర చైన్‌స్నాచర్‌ను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇతని నుంచి 25తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు ముఠా సభ్యులకోసం ప్రత్యేక బలగాలు గాలిస్తున్నాయి. శనివారం శంషాబాద్ డీసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. గత కొన్నినెలలుగా శంషాబాద్ డివిజన్ పరిధిలో చైన్‌స్నాచింగ్‌లు ఎక్కువ కావడంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం కిస్మత్‌పూర్‌లో వాహన త నిఖీలు నిర్వహిస్తుండగా చైన్‌స్నాచర్లు గోవింద్(23), సంజయ్(25) తారసపడడంతో పోలీసులు వారిని వెంబడించగా సంజయ్ పారిపోయాడు. దీంతో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ యాదయ్య గోవింద్‌ను  పట్టుకున్నాడు. అతడిని విచారించగా చేసిన నేరాలను అంగీకరించడంతో ఇతని వద్ద నుంచి 25తులాల బంగారు ఆభరణాలు, పల్సర్‌బైక్(యూపి11జెడ్6289)ను స్వాధీనం చేసుకున్నారు. అతని ముఠా సభ్యులైన హబీర్, మన్‌ప్రీత్, సంజయ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుడి పట్టుకున్న క్రైం కానిస్టేబుల్ యాదయ్యకు  రూ.50వేల రివార్డు అందజేయనున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి, ఇన్ ్సస్పెక్టర్ ఉమేందర్, డీఐ వేణుగోపాల స్వామీ ఎస్పై వెంకట్‌రెడ్డి, నర్సింహ్మ, రవీందర్ నాయక్‌లు పాల్గొన్నారు.

యూపీ నుంచి వచ్చి .....
 ఉత్తర్‌ప్రదేశ్‌లోని షామిలిజిల్లా ఖాన్‌పూర్ గ్రామాని కి చెందిన గోవింద్  మరో ముగ్గురితో కలిసి కొన్ని నెలల క్రితం రాజేంద్రనగర్‌కు వచ్చాడు. దుస్తుల విక్రేతలుగా పరిచయం చేసుకుని శాస్త్రీపురంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఉదయం రెక్కి నిర్వహించి మహిళలు ఒంటరిగా తిరుగుతున్న ప్రాంతా ల్లో  చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడేవారు. ఇప్పటి వరకు 27 స్నాచింగ్‌లు చేశాడని అందులో 17 చోరీలు శంషాబాద్ డివిజన్‌లోనే చేసినట్లు సమాచారం.రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 8, మైలార్‌దేవ్‌పల్లిలో 5, శంషాబాద్‌లో 4, లంగర్‌హౌస్‌లో 4, కులుసుంపురాలో 2, టప్పచపుత్రలో 1, చత్రినాకాలో 1, మీర్‌చౌక్ 1, కామటిపురాలో 1 స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు.  
 
పట్టుబడింది ఇలా..
గొలుసు దొంగలపై నిఘా వేసిన రాజేంద్రనగర్ పోలీసులు సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా సేకరించిన నిందితుల ఫోటోలతో గాలింపులు చేపట్టారు. ఇం దులో భాగంగా శనివారం కిస్మత్‌పూర్ గ్రామంలో ఇన్స్‌స్పెక్టర్ ఉమేందర్, డీఐ వేణుగోపాల్,క్రైం ఎస్సై వెంకట్‌రెడ్డి తనిఖీలు నిర్వహిస్తుండగా బండ్లగూడ వైపు నుంచి పల్సర్‌బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించిన కానిస్టేబుల్ యాదయ్య వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా బైక్ వెనుక కూర్చున సంజయ్ పారిపోయాడు. బైక్ నడుపుతున్న గోవింద్‌ను పట్టుకున్నాడు. నలురుగు ముఠాగా ఏర్పడి స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు.

మరిన్ని వార్తలు