రోడ్లు, భవనాల శాఖకు రూ.5500కోట్ల బడ్జెట్!

9 Feb, 2016 03:42 IST|Sakshi

అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు వచ్చే బడ్జెట్‌లో రూ.5500 కోట్ల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రోడ్లు, వంతెనల నిర్మాణం ముమ్మరంగా జరగాల్సి ఉన్నందున నిధుల అవసరం ఎక్కువగానే ఉంటుందని, ఆ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. సోమవారం ఆయన ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. మేడారం జాతర, కృష్ణా పుష్కరాల పనులపై ఆరా తీశారు.  

 రూ.1,730 కోట్లు ఇవ్వండి...
 మహిళా శిశుసంక్షేమశాఖ ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.1,730కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గతేడాదికంటే ఇది రూ.170 కోట్లు అదనం. బడ్జెట్ ప్రతిపాదనలపై మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల  సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షిం చారు. ఆగిపోయిన కేంద్ర ప్రభుత్వ పథకాలను తొలగించాలని, శిశు సంక్షేమశాఖ పరిధిలోని విద్యకు సంబంధించిన యూనిట్లను విద్యాశాఖకు బదలాయించాలని ఆయన ఆదేశించారు.

మరిన్ని వార్తలు