రూ. 9.58 కోట్ల భారీ చోరీ

22 May, 2016 05:06 IST|Sakshi
రూ. 9.58 కోట్ల భారీ చోరీ

- ఏటీఎంలలో డబ్బులు నింపే ఏజెన్సీలో గోల్‌వూల్
- ఇద్దరు ఉద్యోగులపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
- పరారీలో ఉన్న నిందితులు

 
హైదరాబాద్:
ఏటీఎంలలో డబ్బులు నింపే ఉద్యోగులు ఏజెన్సీని మోసం చేసి డబ్బును అపహరించిన ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... అనంతపూర్ జిల్లాకు చెందిన లోకేశ్ రెడ్డి, పాతబస్తీకి చెందిన ప్రవీణ్ గత కొన్ని నెలలుగా మహేంద్రా హిల్స్ త్రిమూర్తి కాలనీలోని ఆర్‌సీఐ క్యాష్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీలో పని చేస్తున్నారు. సుమారు 52 బ్యాంకుల ఏటీఎంలకు ఈ ఆర్‌సీఐ క్యాష్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ద్వారా డబ్బులు సరఫరా చేస్తారు.

అయితే డబ్బులు సరఫరా చేసే ఉద్యోగం చేస్తున్న లోకేశ్‌రెడ్డి, ప్రవీణ్‌లు ఏజెన్సీలో నుంచి డబ్బులు తీసుకెళ్తున్నారు కాని ఏటీఎంలలో క్యాష్ మాత్రం వేయడం లేదు. గత కొన్ని రోజులుగా ఇదేవిధంగా చేస్తూ వస్తున్నారు. అయితే, ఏప్రిల్‌లో ఆర్‌సీఐ క్యాష్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ యాజమాన్యం ఏజెన్సీని వేరేవాళ్లకు అమ్మేసింది. దీంతో లెక్కలు చూస్తున్న సమయంలో 9.98 కోట్లు మాయం అయినట్లు అందులో తేలింది. దీంతో ఆ ఏజెన్సీ మేనేజర్ నాగరాజు శనివారం స్థానిక తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏటీఎంలకు క్యాష్ సరఫరా చేసే లోకేశ్ రెడ్డి, ప్రవీణ్‌లపై అనుమానం ఉన్నట్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఉద్యోగులు లోకేశ్ రెడ్డి, ప్రవీణ్‌లు పరారీలో ఉన్నారు.

మరిన్ని వార్తలు