వైన్‌షాప్‌ రేకులు పగలకొట్టి..

9 Jul, 2017 12:53 IST|Sakshi
వైన్‌షాప్‌ రేకులు పగలకొట్టి..

హైదరాబాద్‌: హైదరాబాద్‌ సిటీలో దొంగలు రెచ్చిపోయారు. అడ్డు అదుపు లేకుండా చోరీలకు పాల్పడుతున్నారు. "కన్నం వేయడానికి కాదేది అనర్హం" అనుకున్నారో ఏమో ఈసారీ ఏకంగా మద్యం దుకాణానికే కన్నం వేశారు. షాప్‌లో ఉన్నదంతా స్వాహా చేశారు.

తాళం వేసి ఉన్న దుకాణం రేకులు బద్దలు కొట్టి ఉన్నకాడికి ఊడ్చెకెళ్లిన సంఘటన నగరంలోని నేరెడ్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం వెలుగుచూసింది. స్థానిక సైనిక్‌పురిలోని గోకుల్‌ వైన్స్‌లో శనివారం రాత్రి దొంగలు పడి రూ. 6 లక్షల నగదుతో పాటు మద్యాన్ని ఊడ్చుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు