'రోహిత్‌ కేసులో వీసీపై చర్యలేవీ'

16 Jan, 2017 17:09 IST|Sakshi
'రోహిత్‌ కేసులో వీసీపై చర్యలేవీ'

హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్ వేముల రోహిత్‌ది బీసీనా, ఎస్సీనా అని ప్రభుత్వాధికారులు అనడం సిగ్గుచేటని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ ఎస్సీ సెల్‌ ఆధ‍్వర్యంలో రోహిత్‌​ సంస్మరణ సభ సోమవారం జరిగింది. ఈ సభకు జేఏసీ చైర్మన్‌ ప్రొ.కోదండరామ్‌‌, గుండా మల్లేష్‌ పాటు పలువురు నేతలు హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ వైస్‌ చాన్సలర్‌ అప్పారావుపై చర్యలు తీసుకుంటామన్న కేసీఆర్‌ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రోహిత్‌ మరణించి ఏడాది అయిన దీనిపై ప్రధాని మోదీ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధాని ఫాసిస్ట్‌ ధోరణితో వ్యవహరించారని ఆరోపించారు.
 
రోహిత్‌ది ఆత్మహత్య కాదు సంస్థాగత హత్యని కోదండరామ్ అన్నారు. రోహిత్‌ మరణానికి కులవివక్షే కారణమన్నారు. భవిష్యత్‌లో యూనివర్శిటీల్లో కులవివక్షతను నిర్మూలించాలంటే రోహిత్‌ చట్టాన్ని అమలు చేయాలని కోదండ రామ్‌ డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు