పాతబస్తీలో కార్డన్ సెర్చ్: రౌడీషీటర్లు అరెస్ట్

12 May, 2016 09:34 IST|Sakshi

హైదరాబాద్ : పాతబస్తీ, ఫలక్నుమా ప్రాంతాల్లో పోలీసులు గురువారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 16 మంది రౌడీషీటర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎలాంటి ధృవపత్రాలు లేని 60 ద్విచక్రవాహనాలు, 3 కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. సౌత్జోన్ డీసీపీ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 400 మంది పోలీసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు