ఎంఎంటీఎస్లో పోకిరీల ఆగడాలు

11 Feb, 2015 11:09 IST|Sakshi

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆకతాయిల ఆగడాలు రోజురోజుకీ  పెరిగిపోతున్నాయి. నగరంలోని పలు రైల్వే స్టేషన్లలో పోకిరుల వేధింపులు తట్టుకోలేకపోతున్నామంటూ రైల్వే పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దాంతో ఆకతాయిల ఆటకట్టించేందుకు ఆర్పీఎఫ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆర్పీఎఫ్ పోలీసులు బుధవారం ఆకస్మిక తనిఖీలు జరిపారు.

తనిఖీల్లో  మహిళలకు కేటాయించిన రైలు బోగీల్లో ప్రయాణిస్తున్న50మంది యువకులను అరెస్ట్ చేశారు. అలాగే టిక్కెట్ లేకండా ప్రయాణిస్తున్న మరో 50మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. రైళ్లల్లో ప్రయాణిస్తున్నవారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న 10మంది హిజ్రాలను కూడా అరెస్ట్ చేసినట్టు ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా