పాఠశాల విద్యకు రూ.10,792 కోట్లు!

8 Mar, 2017 03:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాల విద్యకు 2017–18 ఆర్థిక సంవత్సరంలో కేటాయించే బడ్జెట్‌ లెక్కలు కొలిక్కివచ్చాయి. రూ.13 వేల కోట్ల వరకు బడ్జెట్‌ కావాలని విద్యా శాఖ ప్రతిపాదనలు అందజేయగా.. ఆర్థికశాఖ కేటాయించే బడ్జెట్‌ సీలింగ్‌ దాదాపు ఖరా రైంది. పాఠశాల విద్యా శాఖకు మొత్తంగా రూ.10,792 కోట్లు కేటాయించేందుకు ఆర్థిక శాఖ అంగీకరించినట్లు తెలిసింది. పాఠశాలల్లో పని చేసే 1.30 లక్షల మంది టీచర్లు, సిబ్బంది వేతనాలకే రూ.9 వేల కోట్లకు పైగా వెళ్లనుండగా, మరో రూ.1,700 కోట్లతో సర్వశిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ (ఆర్‌ఎం ఎస్‌ఏ), మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫారా లు, ఉపాధ్యాయ శిక్షణలు వంటి కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుంది. విభాగాల వారీగా విద్యా శాఖ పద్దులో రూ.8 వేల కోట్లు టీచర్ల వేతనాలకు, మరో రూ.1,000 కోట్లు సర్వశిక్షా అభియాన్‌ పద్దులో 20 వేల మంది టీచర్ల వేతనాలకు కేటాయించనుంది.

ఆర్‌ఎంఎస్‌ఏ కింద కేటాయించిన రూ.270 కోట్లు మోడల్‌ స్కూళ్లలో పని చేస్తున్న 4 వేల మంది టీచర్ల వేతనాల కిందే ఖర్చు కానుంది. 9, 10 తరగతుల్లో మధ్యాహ్న భోజనం, విద్యా కార్యక్రమాలకు రూ.108 కోట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం.  ఇందులో ఎస్‌ఎస్‌ఏకు రూ.2,100 కోట్లు కేటాయిం చనుండగా, 1 నుంచి 8వ తరగతి వరకు మధ్యాహ్న భోజనం  అమలుకు రూ.300 కోట్లు రానున్నాయి. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలికి రూ.14 కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం. ఎస్‌ఎస్‌ఏకు కేటా యించే మొత్తంలో రాష్ట్ర వాటా కింద రూ.1,175 కోట్లు రానున్నాయి. మిగతావి కేంద్రం ఇవ్వనుంది. రాష్ట్ర వాటా గతేడాది కేవలం రూ.575 కోట్లు కాగా, ఈసారి రెట్టింపయ్యింది. ప్రణాళికపరంగా విద్యాశాఖ కార్యక్రమాలను రూపొందించి కేంద్ర ప్రాజెక్టు అప్రూ వల్‌ బోర్డు ఆమోదం తీసుకున్నందున ఎస్‌ఎస్‌ఏ రెట్టింపు అయింది. మరో రూ.2 వేల కోట్ల వరకు సాంకేతిక విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ కు బడ్జెట్‌ కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు