ఐదారు రోజుల్లో మరో రూ.2,020 కోట్లు

3 Aug, 2016 03:03 IST|Sakshi
ఐదారు రోజుల్లో మరో రూ.2,020 కోట్లు

మూడో విడత రుణమాపీని బ్యాంకులకు విడుదల చేస్తాం: పోచారం
సాక్షి, హైదరాబాద్: మూడో విడత విడుదల చేయాల్సిన రుణమాఫీలో మిగిలిన సగం సొమ్మును ఐదారు రోజుల్లో విడుదల చేస్తామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వ్యవసాయ, దాని అనుబంధ శాఖల అధిపతులతో మంగళవారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహిం చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మూడో విడతలో సగం రూ. 2,019.99 కోట్లు ఇటీవల విడుదల చేశామని... మిగిలిన రూ. 2,020 కోట్లు ఐదారు రోజుల్లో విడుదల చేస్తామని ఆయన స్పష్టంచేశారు.

ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి ఆగస్టు ఒకటో తేదీ నాటికి రాష్ట్రంలో సరాసరి 371.2 ఎం.ఎం. వర్షం కురవాల్సి ఉండగా... 435.9 ఎం.ఎం. కురిసిందని వివరించారు. ఆరుతడి పంటలన్నీ ఆశాజనకంగా ఉన్నాయని.. మొత్తం 70 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయన్నారు. రాష్ట్రంలో బాన్సువాడ నియోజకవర్గమే హరితహారంలో నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు