ఆర్టీసీ ఉద్యోగులు అరెస్ట్

3 Feb, 2015 19:38 IST|Sakshi

మియాపూర్: ఆకతాయిల వేధింపుల నుంచి ప్రయాణికులకు రక్షణగా నిలవాల్సిన ఆర్టీసీ ఉద్యోగులు ఇద్దరు కీచక అవతారం ఎత్తారు. బస్టాప్‌లో సివిల్ డ్రెస్‌లో ఉన్న'షీ' పోలీసుతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఆర్టీసీ డ్రైవర్, కానిస్టేబుల్ అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మియాపూర్ బస్టాప్‌లో మంగళవారం సాయంత్రం జరిగింది. షీ పోలీసు బృందానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ అమృత సాధారణ డ్రెస్‌లో ప్రయాణికురాలి మాదిరిగా బస్టాప్‌లో నింలబడి ఉంది. ఆ సమయంలో అక్కడకు వచ్చిన డ్రైవర్ జి.మనోహర్(46), కానిస్టేబుల్ షేక్‌వాహిద్ (26) ఆమెతో అసభ్యకరంగా వ్యవహరించడమే కాకుండా ఫోన్ నెంబర్ అడిగి, అందుకు ఆమె అంగీకరించకపోయినా బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేశారు. వీరి వ్యవహారాన్ని సమీపం నుంచి గమనిస్తున్న  షీ  పోలీసులు వెంటనే అప్రమత్తమై మనోహర్, వాహిద్‌లను అరెస్ట్ చేసి మియాపూర్ పోలీసులకు అప్పగించారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా