ఈ నెల 23 నుంచి ఆర్టీసీ సిబ్బంది సమ్మె

9 Jun, 2016 19:07 IST|Sakshi

కార్మికుల హక్కుల పరిరక్షణకోసం ఈ నెల 23న మొదటి డ్యూటీ నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభం అవుతుందని తెలంగాణ ఆరీ్టిసీ జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టం చేసింది. గురువారం ఆజామాబాద్‌లోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబు, రాజిరెడ్డి, ఎన్‌ఎంయూ చైర్మన్ కమాల్ రెడ్డి, ఎస్‌డబ్ల్యుఎఫ్ కార్యదర్శి వి.ఎస్.రావు తదితరులు మాట్లాడారు.

 

తమ సమస్యల పరిస్కారానికి ఆర్టీసీలోని 7 యూనియన్లుతో కూడిన జేఏసీ గత నెల 16న యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చినా ఎటువంటి స్పందన లేదని తెలిపారు. వేతన సవరణ సందర్భంగా పెరిగిన జీతాల ఖర్చు నెలకు రూ.75 కోట్లు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి తన హామీని తుంగలో తొక్కారన్నారు. వేతన సవరణ బకాయిలను రెండో విడత ఇంత వరకు చెల్లించలేదని, 50 శాతం ఏరియర్స్, బాండ్స్ నేటికి విడుదల కాలేదని చెప్పారు..రెండేళ్లు గడిచినా ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన ఆర్టీసీ కార్మికుల ఒప్పందాలు ఇంత వరకు అమలు కాలేదని విమర్శించారు. దీనికి నిరసనగా 7 సంఘాలతో కలిసి సమ్మె చేస్తున్నామని వారు చెప్పారు.

 

మరిన్ని వార్తలు