ఉరిమే ఉత్సాహం...

29 Jan, 2016 00:45 IST|Sakshi
ఉరిమే ఉత్సాహం...

‘సాక్షి’ ఎరెనా వన్ ప్రారంభం జోష్ నింపిన యూత్ ఫెస్ట్
 
క్రీడలు, కళారంగాల్లో దాగిన ప్రతిభను బయటకు తీసేందుకు చేపట్టిన ‘సాక్షి ఎరీనా వన్’ యూత్‌ఫెస్ట్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వచ్చేనెల 21వ తేదీ వరకు కొనసాగే ఈఫెస్ట్‌లో గురువారం పలు విభాగాల్లో క్రీడా పోటీలు నిర్వహించారు. మూడు వేర్వేరు వేదికలపై సాగిన ఈ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చాటారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ర్యాంప్‌వాక్, మోడలింగ్‌లో భాగంగా విద్యార్థినులు, ఔత్సాహిక మోడల్స్ విభిన్న దుస్తులు ధరించి మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ ఫెస్ట్‌కు ‘బజాజ్ పల్సర్ ఇండియా నంబన్ వన్ బైక్’ అసోసియేటెడ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.
 
హైదరాబాద్: ‘సాక్షి’ ఎరెనా వన్ యూత్ ఫెస్ట్‌లో యువత ఉరిమే ఉత్సాహంతో పాల్గొంది. చదువుతో కుస్తీ పడే విద్యార్థులు తమకు నైపుణ్యమున్న క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కూకట్‌పల్లిలోని కెనె డీ స్కూల్ గ్రౌండ్‌లో త్రోబాల్ పోటీల ను, మైసమ్మగూడలోని ఎంఆర్‌సీఈటీలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించారు. త్రోబాల్ ఈవెం ట్‌లో 20 మహిళా జట్లు, 16 పురుషు ల జట్లు పోటీపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి ముఖ్యఅతిథిగా విచ్చేసి త్రోబాల్ పోటీలను ప్రారంభించిన అనంతరం ఆయ న మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ఆదరిం చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆటల పోటీల్లో విద్యార్థులను ప్రోత్సహిం చేందు కు సాక్షి మీడియా గ్రూపు గురుతర బాధ్యత తీసుకుందని కొనియాడారు. అనంతరం తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పి.జగన్‌మోహన్‌గౌడ్ మాట్లాడుతూ.. సాక్షి యూత్‌ఫెస్ట్‌ను సద్వినియో గం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చా రు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు వినోద్‌రెడ్డి, కోశాధికారి వెంకట్, కెనెడీ స్కూల్ యాజమాన్యం సరళ, రమేశ్ పాల్గొన్నారు.
 
త్రోబాల్ విజేత సెయింట్ మార్టిన్స్
త్రోబాల్ ఓపెన్ టోర్నమెంట్‌లో సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజి (దూలపల్లి) పురుషుల జట్టు విజేతగా నిలిచింది. కూకట్‌పల్లిలోని కెన్నెడీ స్కూల్ గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన పురుషుల విభాగం ఫైనల్లో సెయింట్ మార్టిన్స్ జట్టు 15-7, 15-4 స్కోరుతో భవాన్స్ వివేకానంద డిగ్రీ కాలేజిపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన రౌండ్‌రాబిన్ లీగ్ మ్యాచ్‌ల్లో సెయింట్ మార్టిన్స్ 15-2, 15-6 స్కోరుతో ఐఐఎంసీ (లక్డికాపూల్) జట్టుపై, భవాన్స్ వివేకానంద 15-11, 15-9తో ఐఐఎంసీ (లక్డికాపూల్)పై గెలుపాందాయి.
 
సెయింట్ మార్టిన్స్ ముందంజ
మైసమ్మగూడలోని మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎంఆర్‌సీఈటీ) కళాశాలలో జరిగిన క్రికెట్ టోర్నీ తొలి మ్యాచ్‌లో సెయింట్ మార్టిన్స్ జట్టు... ఎంఆర్‌సీఈటీపై గెలిచింది. మొదట ఎంఆర్‌సీఈటీ 4 వికెట్లకు 98 పరుగులు చేసింది. నితిన్ (43), శివ (38) మెరుగ్గా ఆడారు. తర్వాత 99 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ మార్టిన్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసి గెలిచింది. ఆదర్శ్ (41) రాణించాడు. రెండో మ్యాచ్‌లో నిజామ్ కాలేజి... ఎంఆర్‌ఐటీ జట్టుపై నెగ్గింది. తొలుత నిజామ్ జట్టు 3 వికెట్లకు 53 పరుగులు చేయగా, తర్వాత ఎంఆర్‌ఐటీ 50 పరుగులకే కుప్పకూలింది. నిజామ్ బౌలర్ క్రిస్ కల్యాణ్ 3 వికెట్లు తీశాడు. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ‘సాక్షి’ మీడియా గ్రూపు కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈవెంట్‌ను లాంఛనంగా ఆరంభించారు. ఇందులో హరీష్‌రెడ్డి, ప్రిన్సిపాల్ జాన్‌పాల్, రవీందర్, కళాశాల డెరైక్టర్ సంజీవ రెడ్డి, ఈవో రాజేశ్వర్‌రెడ్డి, హెచ్‌ఓడీ నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 
యూత్‌ఫెస్ట్‌లో నేడు
డిజైన్ అండ్ ఫ్యాషన్
వేదిక: లకోటియా ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్, ఎంపీఎం మాల్, అబిడ్స్ సర్కిల్
సమయం: ఉదయం 11.30
వివరాలకు: 9885527474
 
క్రికెట్ టోర్నమెంట్
వేదిక 1: అరోరా సైంటిఫిక్ టెక్నోలాజికల్ అండ్ రిసర్చ్ అకాడమీ (ఆస్ట్రా), చాంద్రాయణగుట్ట, పల్లెచెరువు దగ్గర
సమయం: ఉదయం 9, 11 గంటలు, మధ్యాహ్నం ఒంటిగంట, 3 గంటలు (4 మ్యాచ్‌లు)
 
వేదిక 2: మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మైసమ్మగూడ, ధూలపల్లి, కొంపల్లి
సమయం: ఉదయం 9, 11 గంటలు, మధ్యాహ్నం ఒంటిగంట, 3 గంటలు (4 మ్యాచ్‌లు)
 
వేదిక 3: నల్లా నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్, కొర్రెముల ఎక్స్ రోడ్, నారపల్లి, ఘట్‌కేసర్ మండలం
సమయం: ఉదయం 9, 11 గంటలు, మధ్యాహ్నం ఒంటిగంట, 3 గంటలు (4 మ్యాచ్‌లు)
వివరాలకు: 9505834448
 
డ్యాన్స్ పోటీలు
వేదిక: ఎంఎల్‌ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దుండిగల్
సమయం: ఉదయం 9.30
వివరాలకు: 9666470203

బాల్
వేదిక: కెనడీ మాగ్నెట్ స్కూల్, మెట్రో పక్కన, కూకట్‌పల్లి
సమయం: ఉదయం 9.30
వివరాలకు: 9705199924
 

మరిన్ని వార్తలు