సాక్షి ప్రాపర్టీ షో షురూ

7 Mar, 2015 23:49 IST|Sakshi
సాక్షి ప్రాపర్టీ షో షురూ

కిక్కిరిసిన స్టాళ్లు..  ఈ రోజుతో ఆఖరు
 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నగరంలో స్థిరాస్తి సంస్థలన్నో... ప్రాజెక్టులూ అనేకం.. కట్టేది మాత్రం వేర్వేరు ప్రాంతాల్లో.. అన్నీ వేటికవే ప్రత్యేకం. వీటన్నింటినీ ఏకకాలంలో కొనుగోలుదారులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ‘సాక్షి’ మెగా ప్రాపర్టీ షోను నిర్వహించింది. శనివారం బంజారాహిల్స్ రోడ్ నం. 1లోని హోటల్ తాజ్ కృష్ణాలో జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రాపర్టీ షోను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నేళు ్లగా స్థిరాస్తి రంగంలో నిధుల లేమి, లోన్ల విడుదల లో కనికరించని బ్యాంకులు, స్థానిక రాజకీయాం శం కారణాలతో నగరంలో స్థిరాస్తి వ్యాపారం మందగించిందన్నారు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్రాల్లో స్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడ్డాయన్నారు. ఇక నగరంలో రియల్ వ్యాపారం పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌లోనే రియల్ ధరలు తక్కువగా ఉన్నాయని, నగరంలో సొంతిల్లు ఉండాలనుకునే వారికి ఇదే మంచి తరుణమని ఆయనన్నారు. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (అప్రెడా) ప్రెసిడెంట్ హరిబాబు మాట్లాడుతూ.. మూడు నెలలుగా నగరంలో స్థిరాస్తి అమ్మకాలు జోరందుకున్నాయని, భవిష్యత్తులో బ్యాంకులు వడ్డీ రేట్ల మరింత తగ్గిస్తే ఈ అమ్మకాలు రెట్టింపు అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సిరి సంపద ఫామ్ ల్యాండ్స్ డెరైక్టర్ రాఘవేంద్ర, ‘సాక్షి’ (అడ్వర్టైజింగ్) వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్, ‘సాక్షి’ (అడ్వర్టైజింగ్) జీఎంలు రమణ కుమార్, కమల్ కిశోర్, సాక్షి (అడ్వర్టైజింగ్) ఏజీఎంలు ప్రవీణ్ రెడ్డి, వినోద్ పాల్గొన్నారు. ప్రాపర్టీ షో ముగియనుంది.
 
గంట గంటకూ లక్కీ డ్రా..
 
సందర్శకుల్లో ఉత్సాహం నింపేందుకు సిరి సంపద ఫామ్ ల్యాండ్స్ ఆధ్వర్యంలో గంట గంటకూ లక్కీ డ్రా నిర్వహించింది. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులనూ అందజేసింది. సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వారికి అందరికీ అనుకూలంగా ఉండేలా నిర్మాణ సంస్థలు ఫ్లాట్లను నిర్మిస్తున్నాయి. కొన్ని సంస్థలు సింగిల్ బెడ్‌రూమ్ నుంచి నాలుగు పడకల గదులు వరకు నిర్మిస్తుండడం విశేషం. కేవలం ఫ్లాట్లే కాకుండా విల్లాలు, డూప్లెక్స్‌తో పాటు స్థలాలు కొనుగోలు చేయాలన్నా సమస్త సమాచారాన్ని ఇక్కడే తెలుసుకోవచ్చు. స్థిరాస్తి కంపెనీలకు సంబంధించిన పూర్తి సమాచారం ఒకే చోట లభిస్తుండటంతో ‘సాక్షి’ ప్రాపర్టీ షో సందర్శకులను అమితంగా ఆకర్షిస్తోంది. ఉద్యోగంలో బిజీగా ఉండే వారికి ప్రాజెక్టులను సందర్శించి వివరాలు తెలుసుకునేందుకు సమయం దొరకదు. అలాంటి వారికి సాక్షి ప్రాపర్టీ షో మంచి అవకాశంగా మారింది.
 
మేలు చేసే పోటీ..
 
మార్కెట్‌లో ఉన్న అన్ని కంపెనీలు ఒకేచోట చేరడం వల్ల సరసమైన ధరలకు ఫ్లాట్, ప్లాట్ లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఒక కంపెనీవారు ఎక్కువ ధర చెప్పినా మరోచోట వాకబు చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. ప్రాపర్టీ షో వల్ల కొన్ని కంపెనీలు పోటీపడి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఫలితంగా వినియోగదారులు సరసమైన ధరలకు, అన్ని వసతులతో తమకు కావాల్సిన ఇంటిని సొంతం చేసుకునే అవకాశముంది.
 
ఫ్లాటూ.. ఫైనాన్స్ ఒకేచోట..
 
‘సాక్షి’ ప్రాపర్టీ షోలో నిర్మాణ సంస్థలే కాదు.. బ్యాం కులూ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. సందర్శకులకు గృహ రుణానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడంతో పాటు లోను సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.
 
పాల్గొన్న సంస్థలివే..
 
మెయిన్ స్పాన్సర్: అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ అసోసియేట్ స్పాన్సర్: ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ  కో స్పాన్సర్స్ : హిల్‌కౌంటీ ప్రాపర్టీస్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సిరి సంపద ఫామ్ లాండ్స్, మంజీర కన్‌స్ట్రక్షన్స్, శ్రేష్ట్ వాటర్ ప్యూరిఫయర్.

పాల్గొన్న సంస్థలు: సత్వ గ్రూప్, ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్, సాకేత్ ఇంజినీర్స్, శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్, ఫార్చూన్ ఇన్‌ఫ్రా డెవలపర్స్, రాజపుష్ప ప్రాపర్టీస్, జనప్రియ ఇంజినీర్స్, ప్రణీత్ గ్రూప్, మ్యాక్ ప్రాజెక్ట్స్, ఆక్సాన్ హౌజింగ్ సొల్యూషన్స్, నార్త్ స్టార్ హోమ్స్, ఎస్‌ఎల్ గ్రూప్, బీఆర్సీ ఇన్‌ఫ్రా, వర్ధన్ డెవలపర్స్, గ్రీన్ హోమ్, శతాబ్ది టౌన్‌షిప్స్ ప్రై.లి., స్వేర్ మైల్ ప్రాజెక్ట్స్, గ్రీన్ సిటీ ఎస్టేట్స్, శ్రీ సాయి బాలాజీ ఎస్టేట్స్,  స్పేస్ విజన్, జీకే డెవలపర్స్, స్వర్ణ విహార్ ఇన్‌ఫ్రా.
బ్యాంకులు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఇండియన్ బ్యాంక్, ఐడీబీఐ.
 
 

మరిన్ని వార్తలు