వైఎస్సార్.. మీకు జోహార్

3 Sep, 2016 01:09 IST|Sakshi

- ఏడో వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు
- వైఎస్‌కు నివాళులర్పించిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు
 
 సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశే ఖరరెడ్డి ఏడో వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు, ప్రజలు మహానేత విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైఎస్సార్‌కు నివాళిగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని మెజారిటీ ప్రాంతాల్లో, మిగతా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో దివంగత నేతకు ప్రజలు ఘన నివాళులర్పించారు. ఖమ్మం జిల్లాలో పార్టీ నాయకులు వెంకటేశ్వరరావు, ఎం.వెంకట్రామిరెడ్డి, ఎ.సుధాకర్, అబ్బిరెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం, పండ్ల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. భద్రాచలంలో పొల్లు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్‌లో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలోని వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి పండ్లు పంపిణీ చేశారు. అయ్యప్ప సొసైటీ వద్ద ఉన్న విగ్రహానికి రాష్ట్ర కార్యదర్శి బసిరెడ్డి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. చేవెళ్లలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి విజయప్రసాద్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. నగరంలోని రామంతపూర్‌లో సుధాకర్‌రెడ్డి, గోవర్దన్‌రెడ్డి, కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. పాతబస్తీలో చార్మినార్ వద్ద వైఎస్సార్ వర్థంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు ఎం. భగవ ంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో అన్నదానం, పండ ్ల పంపిణీ చేశారు. నల్లగొండ జిల్లా కోదాడలో రక్తదాన శిబిరం, పండ్ల పంపిణీ కార్యక్రమాలను చేపట్టారు.

మరిన్ని వార్తలు