ఇఫ్లూలో సంస్కృతం సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశాలు

23 Aug, 2015 10:17 IST|Sakshi

హైదరాబాద్: ఇఫ్లూ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి సంస్కృతంలో సర్టిఫికెట్ కోర్సును నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు శనివారం పేర్కొన్నారు. 3 నెలలపాటు వారంలో మూడు రోజులు తరగతులు జరగనున్నట్లు తెలిపారు. రూ. 500 ఫీజు గల ఈ కోర్సు కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు వర్సిటీలో సంప్రదించాలని కోరారు.

మరిన్ని వార్తలు