3 కేంద్రాల్లో సర్పంచ్‌ల సమ్మేళనాలు

16 Feb, 2018 01:33 IST|Sakshi

23న పాలమూరు, 27న వరంగల్, మార్చి 5న నిజామాబాద్‌లో..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మూడు కేంద్రాల్లో సర్పంచ్‌ల సమ్మేళనాలు నిర్వహించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ(టీసీపార్డ్‌) సన్నాహాలు చేస్తోంది. ప్రతి జిల్లా నుంచి 100 మంది సర్పంచ్‌లను ఈ సమ్మేళనానికి ఆహ్వానిస్తున్నారు. వీటిలో ఉత్తమ పంచాయతీలుగా గుర్తింపు పొందిన గ్రామ సర్పంచ్‌ల అనుభవాలు పంచుకుంటారు. ఈ నెల 23న మహబూబ్‌నగర్‌లో, 27న వరంగల్‌లో, మార్చి 5న నిజామాబాద్‌లో సమ్మేళనాలను నిర్వహించనున్నారు.  

సమ్మేళనాల్లో పాల్గొనే జిల్లాలివీ..
జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్, మే డ్చల్‌ మల్కాజ్‌గిరి, నల్లగొండ, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల సర్పంచ్‌ల సమ్మేళనాన్ని మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్, యాదా ద్రి భువనగిరి జిల్లాల సమ్మేళనం వరంగల్‌లో జరగనుంది.

ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, కొమురంభీం ఆసిఫాబాద్, మం చిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల సమ్మేళనం నిజామాబాద్‌లో నిర్వహించనున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యే ఈ సమ్మేళ నాల్లో ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న టీశాట్‌ చానల్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యక్రమాల ప్రసారాలను ఈ నెల 24న మంత్రి జూపల్లి ప్రారంభించనున్నారు.

మరిన్ని వార్తలు