ఇళ్ల కూల్చివేతలు ఆపాల్సిందే: సర్వే

28 Jul, 2014 15:57 IST|Sakshi
ఇళ్ల కూల్చివేతలు ఆపాల్సిందే: సర్వే

అనుమతులు లేవన్న పేరుతో జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న ఇళ్ల కూల్చివేతలను తక్షణం ఆపాల్సిందేనని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. అలా అక్రమ నిర్మాణాలుంటే క్రమబద్ధీకరణ చేయాలన్నారు.మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని తెలంగాణ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య సమీక్షించినప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది.

కూల్చివేతలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారాలతో కేసీఆర్ సీమాంధ్రుల్లో భయాందోళనలు కలిగిస్తున్నారని, తెలంగాణలో పుట్టిన విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాల్సిందేనని సర్వే అన్నారు. రీయింబర్స్మెంట్కు 1956 స్థానికత ప్రాతిపదిక అనడం సరికాదని ఆయన మండిపడ్డారు. ఇక తెలంగాణ ప్రాంతంలో సీనియర్ నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని, పార్టీ ఓటమికి ఒక్క పొన్నాలనే బాధ్యుణ్ని చేయడం సరికాదని ఆయన చెప్పారు. పొన్నాలనే పీసీసీ చీఫ్‌గా కొనసాగించాలని సోనియాను కోరినట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు