ఓయూ అభివృద్ధికి ‘రూసా’

21 Jan, 2014 05:29 IST|Sakshi
  •     రూ.126 కోట్లతో ప్రణాళిక
  •      విశ్వవిద్యాలయంగా నిజాం కాలేజ్!
  •  
    ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌లైన్: ఓయూ అభివృద్ధికి రాష్ట్రీయ ఉచ్చతార్ సర్వశిక్ష అభిమాన్ (రూసా) పథకంలో భాగంగా రూ.126 కోట్ల ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. రూసా పథకాన్ని దక్కించుకోవాడానికి అన్ని అర్హతలు గల ఓయూ పక్కా ప్రణాళికను రూపొందించింది.  ఓయూ అనుబంధ నిజాం స్వయం ప్రతిపత్తి కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.

    రంగాపూర్‌లోని నిజాం అబ్జర్వేటర్ కేంద్రంలో కొత్తగా ఇంజినీరింగ్ కళాశాల స్థాపనకు సమాయత్తం అవుతుంది. వీటితో పాటు కొత్త భవనాల నిర్మాణాలు, ఇతర మౌలిక వసతులతో ఆధునికీకరించనున్నారు. ఈ మేరకు అంశాలతో రూసా పథకానికి దరఖాస్తు చేశారు. దీన్ని సాధించుకునేందుకు ఓయూ వీసీ ప్రొ.సత్యనారాయణ, ఇతర అధికార్లతో ముమ్మర కసరత్తే చేస్తున్నారు. గత డిసెంబరు 30న రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారుల ఎదుట రూసా కోసం రూపొందించిన ప్రణాళికను ప్రదర్శించారు. గతేడాది యూనివర్సటీ ఫర్ పొటెన్షియల్ ఎక్స్‌లెన్స్ (యూపీఈ) హోదాను దక్కించుకొని రూ.50 కోట్ల నిధులను ఓయూ సాధించింది. యూజీసీ డీన్ ప్రొ.రవీంద్రనాథ్ తెలిపిన ప్రకారం రూసా కింద పలు ప్రయోజనాలు చేకూరనున్నాయి.
         
    నిజాం కాలేజ్‌కి విశ్వవిద్యాలయం హోదా. దాంతోపాటు రూ.55 కోట్ల నిధులు మంజురు.
         
    కొత్త ఇంజినీరింగ్ కాలేజ్ స్థాపనకు ఓయూకు రూ.26 కోట్లు అందనున్నాయి. ఓయూకు అనుబంధంగా రంగాపూర్‌లో కొనసాగుతున్న నిజాం అబ్జర్వేటరీ కేంద్రంలో కొత్త ఇంజినీరింగ్ కళాశాల స్థాపన.
         
    దేశంలోనే తొలిసారిగా ఇంటిగ్రేటెడ్ కోర్సులతో ఈ కళాశాల స్థాపన. రంగాపూర్‌లో కొత్తగా 2500 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్క్ రానున్నందున అక్కడ స్థాపించే టాటా, బీడీఎల్, బీహెచ్‌ఎల్ నూతన పరిశ్రమలకు అనుకూలమైన సిలబస్‌తో ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు యోచన.  
         
    ఓయూలో వివిధ రకాల ఆధునిక మౌలిక వసతుల కోసం రూ.20 కోట్ల నిధులు. వీటితో పాటు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్‌కు రూ.20 కోట్లు, సంప్రదాయ కోర్సులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలనిచ్చే కోర్సులకు రూ.5 కోట్లు మంజూరు. వీటితో పాటు ఓయూకు కొత్తగా 100 అధ్యాపక ఉద్యోగాల మంజూరు.
     

మరిన్ని వార్తలు