ఎస్సీ కార్పొరేషన్‌ నిధులు విడుదల చేయాలి

28 Jul, 2017 01:25 IST|Sakshi
ఎస్సీ కార్పొరేషన్‌ నిధులు విడుదల చేయాలి

మల్లు రవి డిమాండ్‌
సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ కార్పొరేషన్‌ వరుసగా మూడేళ్లుగా రుణాలు ఇవ్వడంలేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి చెప్పా రు. గురువారం ఆయన మాట్లాడుతూ 2014లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీ కార్పొరేషన్‌ ఎలాంటి రుణాలు ఇవ్వలేదని, ఎస్సీ నిరుద్యోగులను ఆదుకోవడానికి తీసుకున్న చర్యలేమీ లేవని అన్నారు.

బడ్జెట్‌లో పెట్టినా, నిధులను ప్రభుత్వం మంజూరు చేయకపోవడంవల్ల బ్యాంకులు రుణాలను ఇవ్వడం లేదని, నిరుద్యోగ యువతపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం తక్షణమే నిధులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ ఏం మాట్లాడారో, సీఎం ఇచ్చిన హామీలేమిటో ప్రజలకు వెల్లడించాలని కోరారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా