ఎందుకు?ఎలా?

27 Aug, 2015 00:14 IST|Sakshi
ఎందుకు?ఎలా?

{పమాద సంఘటనలపై శాస్త్రీయ విశ్లేషణ
భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు
మలేషియాలో ప్రత్యేక శిక్షణ పొందిన ఎంవీఐలు

 
సిటీబ్యూరో: నిత్యం ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాద సంఘటన లు చోటుచేసుకుంటున్నాయి. చిన్న వాహన చోదకుల తప్పిదాలతో ఇవి సంభవిస్తున్నా...పెద్ద వాహనాల పైనే నేరం మోపడం పరిపాటిగా మారింది. ఈ ప్రమాదం ఎలా? ఎందుకు జరిగింది? తప్పెవరిది? భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై శాస్త్రీయమైన, సమగ్రమైన విశ్లేషణ లోపిస్తోందనే  అభిప్రాయం బలంగా ఉంది. ఇలాంటి అశాస్త్రీయ ధోరణుల నుంచి బయట పడేందుకు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది. ప్రమాదాలకు కారణాలపై విశ్లేషణ, నియంత్రణకు చేపట్టవలసిన చర్యలపై నూతన ఒరవడికి  శ్రీకా రం చుడుతోంది. ఇందులో భాగంగా 10 మంది మోటారు వాహన తనిఖీ అధికారులు మలేషియాలో ప్రత్యేక శిక్షణ పొం దారు. ‘క్రాష్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంజ్యూరీస్ అనాలిసిస్’ అనే అంశంపై ఇటీవల మలేషియాలో మూడు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ అవగాహన, శిక్షణ కార్యక్రమంలో ఎంవీఐలు  పాల్గొన్నారు.  
 ఏకపక్ష పద్ధతికి స్వస్తి...
 ప్రమాదాలకు కారణాలను విశ్లేషించడం లో ఎంవీఐలు భాగస్వాములు కావడం లేదు. సంఘటనల అనంతరం వాహనం  కండీషన్, బ్రేక్‌లు, ఇంజన్ నాణ్యత వంటి అంశాలపైన అధ్యయనం చేసి నివేదికలు రూపొందిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఎంవీఐలకు అవగాహన లోపిస్తోంది. ఫలితంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణ, రహదారుల నిర్మాణ పద్ధతులు, డ్రైవింగ్ లోపాలు తదితర అంశాలను కచ్చితంగా విశ్లేషించలేకపోతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వంటి భారీ దుర్ఘటనలు జరిగినప్పుడు మినహా పోలీసు శాఖతో పోల్చితే రవాణా శాఖ ప్రమేయం చాలా తక్కువ. కేవలం వాహనాల సామర్ధ్య విశ్లేషణకే  పరిమితం కావడంతో ప్రమాదాలను అరికట్టడంలో ఆశించిన ఫలితాలను సాధించలే మని రవాణా శాఖ గుర్తించింది. ఈ క్రమంలో తెలంగాణ ఎంవీఐ అసోసియేషన్ అధ్యక్షులు పాపారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పుప్పాల శ్రీనివాస్‌ల నేతృత్వంలో పదిమంది ఎం వీఐలు ప్రత్యేక శిక్షణ పొందారు. ప్రమా దం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకోవడం... కారణాలను సమగ్రంగా విశ్లేషించి నివేదికలు రూపొందించడంపై స్పష్టమైన అవగాహన పొందినట్లు పుప్పాల శ్రీనివాస్ చెప్పారు.
 
విశ్లేషణ ఇలా...
సంఘటన స్థలం, రోడ్డు నిర్మాణంపై అధ్యయనం తప్పనిసరి.
భారీ దుర్ఘటనలు మొదలుకొని చిన్న చిన్న ప్రమాదాలపైనా డేటా బేస్ రూపొందించాలి.
{పమాద సమయంలో వాహనం ఎంత వేగంతో ఉన్నప్పుడు బ్రేకులు వేశారనే అంశం కీలకం.
లభించిన ఆధారాలపై ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో విశ్లేషిస్తారు.
నష్టాన్ని విశ్లేషించడం, నమూనా చిత్రాల రూపకల్పన, ప్రమాదాల వర్గీకరణ వంటి  అంశాలపై అధ్యయనం.
 ఔటర్ రింగ్ రోడ్డు, హైవేలలో ప్రమాదాలు జరగకుండా పాటించవలసిన రోడ్డు భద్రత నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించడం.
 

>
మరిన్ని వార్తలు