ముత్తాత జాడ కోసం స్కాట్లాండ్ నుంచి ...

17 Feb, 2015 12:07 IST|Sakshi
ముత్తాత జాడ కోసం స్కాట్లాండ్ నుంచి ...

హైదరాబాద్: స్కాట్లాండ్కు చెందిన నికోలస్ గ్రేవ్స్ తన ముత్తాతకు సంబంధించిన సమాచారం కోసం హైదరాబాద్ నగరానికి విచ్చేశారు. నిజాం రైల్వేలో విధులు నిర్వహించిన తన ముత్తాత జేమ్స్ థిడోర్ వివరాల కోసం గ్రేవ్స్ సోమవారం దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవను కలిశారు. ఈ సందర్భంగా జేమ్స్ థిడోర్కు సంబంధించిన పెన్షన్ బుక్ను జీఎం శ్రీవాస్తవకు చూపించారు. ఆయన వెంటనే జేమ్స్స థిడోర్ వివరాలు సేకరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. 1932లో నిజాం రైల్వేస్లో జేమ్స్ థిడోర్ లోకో ఫిట్టర్గా విధులు నిర్వర్తించినట్లు ఈ సందర్బంగా గుర్తించారు.

ఆయన 1897 డిసెంబర్ 15న జన్మించారు. కాగా థిడోర్ కుమార్తె... నికోలస్ గ్రేవ్స్ నానమ్మ అయిన ఫిలిస్ మార్గరేట్ చాంపియన్ 1920 సెప్టెంబర్ 19న సికింద్రాబాద్లో జన్మించారు.ఇండియాలోని బ్రిటిష్ ఆర్మీలో పని చేసిన పెర్సీ జేమ్స్ చాంపియన్తో ఆమె వివాహం అయింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో 1939లో నికోలస్ గ్రేవ్స్ అమ్మమ్మ, తాతయ్య ఇంగ్లాండ్ తరలి వెళ్లారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన ఇండియన్ రైల్వే ఫ్యాన్ క్లబ్ సమావేశానికి నికోలస్ గ్రేవ్స్ వచ్చారు.

ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులను నికోలస్ గ్రేవ్స్ కలిసి... తన ముత్తాత గురించి వివరించారు. దీంతో నికోలస్కు తన ముత్తాత సమాచారాన్ని అధికారులు అందించారు. దీంతో నికోలస్ ఆనందపరవశం పొందారు. తన ముత్తాత జేమ్స్ థియోడోర్ పింఛను పుస్తకాన్ని జీఎం శ్రీవాత్సవకు బహుమానంగా అందజేశారు.

మరిన్ని వార్తలు