ఐఐటీ అర్హుల్లో రెండో స్థానం

7 Jul, 2014 02:34 IST|Sakshi

ఉమ్మడి ఇంటర్ బోర్డునుంచి మొదటి దశలో 3,350 మందికి అర్హత
 
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో (ఐఐటీ) మొదటి దశ ప్రవేశాలకు అర్హత సాధించిన వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెంది న ఉమ్మడి ఇంటర్మీడియెట్ బోర్డు విద్యార్థులకు రెండో స్థానం దక్కింది. రెండు రాష్ట్రా ల ఉమ్మడి బోర్డు నుంచి దాదాపు 21 వేల మంది ఐఐటీలో సీట్ల కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయగా 3,350 మందికి మొదటి దశ ప్రవేశాల్లో అవకాశం లభించింది. దేశ వ్యాప్తంగా ఉన్న 17 ఐఐటీల్లో సీట్ల కోసం దాదాపు 1.30 లక్షల మంది పోటీ పడ్డా రు. ఇందులో మొదటి ప్రవేశాలకుగాను, దేశవ్యాప్తంగా టాప్ ర్యాంకులు సాధించిన దాదాపు 18 వేల మందికి అవకాశం లభించింది.
 
ఇందులో, సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై, ఆ బోర్డు టాప్-20 పర్సంటైల్‌లోని 9,758 మంది ఉన్నారు. దీంతో సీబీఎస్‌ఈ సంస్థ అత్యధిక విద్యార్థులతో ప్రథమ స్థానం దక్కించుకుంది. రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా సేవలు అందిస్తున్న మన ఇంటర్మీడియెట్ బోర్డునుంచి 3,350 మందికి అవకాశం లభించటంతో బోర్డుకు రెండో స్థానం దక్కింది. నేడు ప్రకటించాల్సిన రెండోదశ, 12న ప్రకటించే మూడో దశ ప్రవేశాల్లోనూ మన బోర్డు నుంచి మరింత మందికి అవకాశం లభించనుంది.

మరిన్ని వార్తలు