సీనియర్ జర్నలిస్ట్ వి. హనుమంతరావు మృతి

14 Dec, 2016 03:45 IST|Sakshi
సీనియర్ జర్నలిస్ట్ వి. హనుమంతరావు మృతి

కేసీఆర్, చంద్రబాబు, వైఎస్‌ జగన్‌ సహా ప్రముఖుల సంతాపం

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ జర్నలిస్టు, డీఎన్‌ ఎఫ్‌ న్యూస్‌ ఏజెన్సీ వ్యవస్థాపకుడు వి.హను మంతరావు(91) మంగళవారం ఉదయం కన్ను మూశారు. వృద్ధాప్యంతో కొంతకాలంగా నలతగా ఉంటున్న ఆయన మంగళవారం ఉద యం శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. హను మంతరావు మరణవార్త తెలియగానే శ్రీనగర్‌ కాలనీ నాగార్జుననగర్‌లోని ఆయన నివాసానికి సన్ని హితులు, జర్నలిస్టులు చేరుకుని నివాళి అర్పిం చారు. ఆయన భార్య సరళ, కుమారుడు సతీష్‌ బాబులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణు కులో పుట్టిన హనుమంతరావు కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య వద్ద స్టెనోగా చేరి, ఆ పై జర్నలిస్టు జీవితాన్ని ఆరం భించి అంచెలంచెలుగా ఎదిగి వివిధ పత్రికలు, హోదాల్లో పనిచేశారు.

ప్రముఖుల సంతాపం..
హనుమంతరావు మరణంతో తెలుగు జర్నలి జం గొప్ప వ్యక్తిని కోల్పోయినట్లయ్యిందని తెలంగాణ, ఏపీ సీఎంలు, ప్రతిపక్ష నాయకులు కేసీఆర్, చంద్రబాబునాయుడు, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, కె.జానారెడ్డి అన్నారు. హనుమంతరావు  మృతి మీడియా రంగానికి తీరని లోటని, జర్నలిజానికి రోల్‌ మోడల్‌ లాంటి వారని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. హనుమంతరావు  కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సీనియర్‌ జర్న లిస్టు కె.రామచంద్రమూర్తి, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు రాజమౌళి, విజయ్‌ కుమార్‌రెడ్డి, జర్నలిస్టులు మల్లె్లపల్లి లక్ష్మయ్య, వీక్షణం వేణుగోపాల్, సీఎం సీపీఆర్‌వో నర్సింగరావు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌ రెడ్డి తదితరులు హనుమంతరావు భౌతిక కాయానికి నివాళులర్పించారు.

హనుమంత రావు మృతిపట్ల ఇండియన్‌ జర్నలిస్టు యూని యన్‌(ఐజేయూ), తెలంగాణ స్టేట్‌ వర్కింగ్‌ జర్నలిస్టు యూనియన్‌ (టీయూ డబ్ల్యూజే) సంతాపం వ్యక్తం చేశాయి. ఐజేయూ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్, సీనియర్‌ నాయకులు కె.శ్రీని వాస్‌రెడ్డి, టీయూ డబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె.విరహత్‌ అలీ హను మంతరావు భౌతిక కాయానికి నివాళులర్పిం చారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని గాంధీ మెడికల్‌ కళాశాలకు దానం చేశారు. హనుమంతరావు మృతి పట్ల సీపీఐ, సీపీఎం, యూసీసీఆర్‌ (ఎంఎల్‌) సంతాపాన్ని ప్రకటిం చాయి. విశాలాంధ్ర విలేకరిగా జర్నలిస్టు జీవితాన్ని ప్రారంభించి సుదీర్ఘకాలం వివిధ పత్రికల్లో పనిచేశారని, ఫ్రీలాన్సర్‌గా నేటితరం జర్నలిస్టులకు ఆదర్శంగా నిలిచారని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. తుదిశ్వాస వరకు సమాజంలో మార్పు కోసం కృషి చేశారని సీపీఎం నేత జి.నాగయ్య పేర్కొన్నారు. ఆయన మరణం జర్నలిస్టులు, కమ్యూనిస్టు ఉద్యమానికి, సాహితీలోకానికి తీరని లోట న్నారు. ఆయన మరణంతో కమ్యూనిస్టులు నిజమైన మిత్రుడిని కోల్పోయారని యూసీసీఆర్‌ఐ (ఎంఎల్‌) కార్యదర్శి వినోద్‌ సంతాపం తెలిపారు. హనుమంతరావు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో కె.ప్రతాపరెడ్డి (సీపీఐ), నరసింహారావు, శ్రీనివాస్‌ (సీపీఎం) తదితరులున్నారు.

హనుమంతరావు ఓ విప్లవకారుడు
హనుమంతరావు నిజమైన విప్లవకారుడని, ఆయన మరణానికి ప్రగాఢ సానుభూతిని ప్రక టిస్తున్నామని భారత కమ్యూనిస్టు విప్లవకా రుల సమైక్యతా కేంద్రం (మార్కిస్టు–లెనినిస్టు) ప్రకటించింది.

వైఎస్‌ జగన్‌ సంతాపం
ప్రముఖ జర్నలిస్టు వి.హనుమంతరావు మృతికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సుదీర్ఘ జర్నలిస్టు జీవితంలో వయసు పైబడిన తరుణంలో కూడా ఆయన చురుగ్గా ఉంటూ క్రియాశీలంగా వృత్తిని కొనసాగించారని జగన్‌ శ్లాఘించారు. ఆర్థిక పరమైన, బడ్జెట్‌ విశ్లేషణలకు హనుమంతరావు పేరెన్నికగన్న వ్యక్తి అని కొనియాడుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని జగన్‌ ఆకాంక్షించారు.
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా