ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండా మోస్తున్న అసదుద్దీన్‌

14 Jan, 2017 02:38 IST|Sakshi
ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండా మోస్తున్న అసదుద్దీన్‌

కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ ఆరోపణ

సాక్షి, హైదరాబాద్‌: ముస్లింల మక్కా యాత్రకు ఇచ్చే సబ్సిడీని రద్దుచేయాలంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడటం సరికాదని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా పవిత్ర మక్కాకు వెళ్లాలని కోరుకుంటారని చెప్పారు. పేద ముస్లింలు మక్కాకు వెళ్లే అవకాశం కల్పించడానికి 1932లోనే బ్రిటిష్‌ ప్రభుత్వం సబ్సిడీని ప్రారంభించిందని చెప్పారు. ఇప్పుడు దేశం నుంచి 1.72 కోట్ల మంది ముస్లింలు మక్కా వెళ్తున్నారని, దీనికి కేంద్ర ప్రభుత్వం రూ.690 కోట్లు సబ్సిడీ ఇస్తోందని పేర్కొన్నారు.

ఈ సబ్సిడీని రద్దుచేసి సంక్షేమానికి కేటాయించాలని అసదుద్దీన్‌ కోరడం మంచిది కాదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాను అసదుద్దీన్‌ మోస్తున్నట్టుగా కనిపిస్తున్నదని షబ్బీర్‌ అలీ విమర్శించారు. ఇది బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మాట్లాడిస్తున్నట్టుగా ఉందన్నారు. 2004లో రూ.74 లక్షలు ఉన్న అసదుద్దీన్‌ ఆదాయం 2014 నాటికి రూ.4 కోట్లకు పెరిగిందన్నారు. అదే స్థాయిలో ముస్లింలందరి ఆదాయం పెరిగిందా అని ప్రశ్నించారు. అసదుద్దీన్‌ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు