బీసీలంటే చులకన ఎందుకు?

27 Dec, 2016 01:59 IST|Sakshi
బీసీలంటే చులకన ఎందుకు?

‘కల్యాణలక్ష్మి’పై చర్చలో షబ్బీర్‌
- ఆదాయ పరిమితి పెంచాలి: పొంగులేటి
- అర్హుల ఎంపికలో ఎమ్మెల్సీలను భాగస్వాములను చేయాలని డిమాండ్‌
- ఎమ్మెల్సీలకు అవకాశం ఇవ్వలేం: జగదీశ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర జనాభాలో యాభై శాతం ఉన్న బలహీన వర్గాల అభ్యున్నతి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండలిలో విపక్ష నేత షబ్బీర్‌అలీ ధ్వజమెత్తారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల అమలుపై శాసన మండలిలో సోమవారం స్వల్పకాలిక చర్చ సందర్భంగా షబ్బీర్‌ మాట్లాడుతూ.. బీసీల కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించిన నిధులను 12 శాతానికి మించి ప్రభుత్వం ఖర్చు చేయలేక పోవడమే ఇందుకు నిదర్శనమని విమర్శిం చారు. కల్యాణలక్ష్మి పథకం కింద బీసీ వర్గాలకు రూ.300 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.34 కోట్లు మాత్రమే ఖర్చుచేసిందని, మరో రెండు నెలల్లో కొత్త బడ్జెట్‌ కూడా రాబోతుందని తెలిపారు.

ఎస్టీలకు కేటాయించిన నిధుల్లో 49 శాతం ఖర్చు చేసిన సర్కారు, ఎస్సీలకు కేటా యించిన నిధుల్లో 69 శాతం ఖర్చు చేయలేదన్నారు. మైనార్టీలకు సంబంధించి షాదీ ముబారక్‌ పథకం కింద 25 వేల దరఖాస్తులు వస్తే కేవలం 9 వేల (30 శాతం) దరఖాస్తులనే క్లియర్‌ చేసిందని చెప్పారు. పేద కుటుంబాలకు చెందిన అమ్మా యిల పెళ్లిళ్లు వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ హయాంలోనే ఇలాంటి పథకాన్ని అమలు చేశామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పేరిట ప్రవేశపెట్టిన పథకం మంచిదే అయినప్పటికీ, అమలు తీరు ఘోరంగా ఉందని విమర్శించారు.

ఆధార్‌ ఆధారంగానే  పరిశీలన: జగదీశ్‌రెడ్డి
పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను అమలు చేస్తోందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆయా పథకాలకు అర్హులైన ఆడపిల్లల కుటుంబాలకు రూ.51 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తుందని చెప్పారు. 2014–15లో 5,779 మంది, 2015–16లో 76,182 మంది, 2016–17లో 32,513 మంది ఆడపిల్లలు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల ద్వారా లబ్ది పొందినట్లు వివరించారు. వివాహ సమయానికి సొమ్ము అందాలంటే నెల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతేడాది అందిన దరఖాస్తుల మేరకు ఈ ఏడాది అంచనాలను రూపొం దించి బడ్జెట్‌లో నిధులు (ప్రొవిజన్‌) కేటాయించా మని, అర్హత కలిగిన దరఖాస్తుదారులందరికీ లబ్ది చేకూరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. నిర్ధిష్టమైన పరిధిలో అర్హు లను గుర్తించేందుకు ఎమ్మె ల్యేలకు మాత్రమే వీలున్నం దున, ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిం చలేమని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఆదాయ పరిమితి 3 లక్షలకు పెంచాలి
పేద కుటుంబాల్లోని ఆడ పిల్లల పెళ్లిళ్లకు ఉద్దేశించిన ఈ పథకంలో ఆయా కుటుంబాల ఆదాయ పరిమితిని గ్రామాల్లో రూ.2.5 లక్షలకు, పట్టణాల్లో రూ.3 లక్షలకు పెంచాలని పొంగులేటి కోరారు. మజ్లిస్‌ సభ్యుడు రజ్వీ మాట్లాడుతూ.. మైనార్టీలు సమర్పించిన దర ఖాస్తుల పరిశీలనను సులభతరం చేయాలన్నారు. ఎమ్మెల్సీ లకు కూడా ఆయా పథకాల అమలు బాధ్య తలను అప్పగించాలని రామచంద్ర రావు కోరారు.

మరిన్ని వార్తలు