2017లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలనే ఎత్తుగడ

3 Jun, 2016 13:33 IST|Sakshi

రాష్ట్రావతరణ వేడుకలకు వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. పత్రికల్లో పేజీల కొద్ది ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. శుక్రవారం ఆయన ఇక్కడ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం ఖాయమన్నారు.


ఉప ఎన్నికలకు బదులు అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టుగా ఉందన్నారు. 2017లోనే అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలనేది కేసీఆర్ ఎత్తుగడని, అందుకే 2022 నాటికి హామీల అమలు అంటూ మాట్లాడుతున్నాడని చెప్పారు. 2019 వరకు కేసీఆర్ ప్రభుత్వానికి గడువు ఉండగా... 2022కు హామీలు నెరవేరుస్తామనడం వెనుక మతలబు ఏమిటి? అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు