వ్యవసాయంలో ర్యాంకు సంగతి ఏమిటి?

2 Nov, 2016 01:17 IST|Sakshi
వ్యవసాయంలో ర్యాంకు సంగతి ఏమిటి?

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సులభ వాణిజ్యం గురించి గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం వ్యవసాయం ర్యాంకు గురించి ఎందుకు మాట్లాడటం లేదని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ మంగళవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. రుణమాఫీ చేయకుండా, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకుండా, నకిలీ విత్తనాలను అరికట్టకుండా, కరువు, వరదల్లో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా సాధించిన ఫలితాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఇప్పటిదాకా ఎన్ని పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారో, వాటిద్వారా వచ్చిన పెట్టుబడి, యువతకు లభించిన ఉపాధి, వాటిలో తెలంగాణ వారికి వచ్చిన ఉద్యోగాలు, జిల్లాల వారీగా శ్వేతపత్రం ప్రకటించాలని కోరారు. 

మరిన్ని వార్తలు