‘అంబేద్కర్‌లా ఆలోచించిన శంకరన్’

26 Oct, 2014 01:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: అంబేద్కర్ ఆలోచన విధానాలు సమానత్వం, న్యాయం అనే అంశాలను జీవితాంతం పెనవేసుకున్న గొప్ప వ్యక్తి ఎస్‌ఆర్ శంకరన్ అని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ సంయుక్త కార్యదర్శి ఉండ్రు రాజశేఖర్ కొనియాడారు.  సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్(సీడీస్) ఆధ్వర్యంలో శనివారం మాజీ ఐఏఎస్ ఎస్‌ఆర్ శంకరన్ 4వ స్మారకోపన్యాసాన్ని పురస్కరించుకుని ఆయున ముఖ్యఅతిథిగా పాల్గొని ‘రాజకీయ ప్రాతినిధ్యంపై అంబేద్కర్ ఆలోచనలు’ అంశంపై ప్రసంగించారు. జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం దక్కాలని అంబేద్కర్ పోరాడారని తెలిపారు.

శంకరన్ ఆదర్శప్రాయులు: కె.రామచంద్రమూర్తి

ఎస్‌ఆర్ శంకరన్ వ్యక్తిత్వం చాలా గొప్పదని, ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. సమావేశంలో గౌరవ అతిథిగా పాల్గొన్న ఆయన శంకరన్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ సి.బీనా, చుక్కా రావుయ్యు, కె.ఆర్. వేణుగోపాల్, కాకి మాదవరావు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు