ఆమె మానసిక స్థితి సరిగా లేదు: శాడిస్టు భర్త

29 Sep, 2016 14:22 IST|Sakshi
హైదరాబాద్ : తన భార్య పూర్ణజ్యోతి మానసిక పరిస్థితి సరిగా లేదని శాడిస్టు భర్త శివశంకర్ ఆరోపించాడు. అందుకే ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశానన్నాడు. కట్నం తీసుకోకుండానే పెళ్లి చేసుకున్నానని... భార్యను వేధించలేదని చెప్పాడు. అనవసరంగా తనపై ఆరోపణలు చేస్తోందన్నాడు. 
 
సాఫ్ట్వేర్ ఇంజినీరైన తన భర్త ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఐపీ పరిజ్ఞానంతో సెల్‌ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకుని వాటిని చూపిస్తూ వేధిస్తున్నాడని పూర్ణజ్యోతి తెలిపింది. ఆ దృశ్యాలను తాను చూడటమే కాకుండా స్నేహితులకూ చూపిస్తూ భార్య వ్యక్తిగత జీవితాన్ని బజారుకీడ్చాడని చెప్పింది. ప్రతి రోజు అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది. దీనిపై పూర్ణజ్యోతి బుధవారం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  
మరిన్ని వార్తలు