ప్రవాసులను ఆదర్శంగా తీసుకోవాలి

21 Dec, 2015 03:22 IST|Sakshi
ప్రవాసులను ఆదర్శంగా తీసుకోవాలి

‘ఆటా’ ముగింపు వేడుకల్లో రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
 
 సాక్షి, హైదరాబాద్: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను, భాషావ్యాప్తిని ప్రవాస తెలుగువారు చక్కగా కాపాడుకుంటూ వస్తున్నారని, ఇక్కడి వారు విదేశాల్లో ఉన్న మన తెలుగువాళ్లను ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. ఉద్యోగాలు, వ్యాపారాలకే పరిమితం కాకుండా జన్మభూమికి సేవలందిస్తూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించడం అభినందనీయమన్నారు. అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం శిల్పకళా వేదికలో ఆటా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఆటా ఎలక్ట్ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ 15 రోజులుగా వివిధ జిల్లాల్లో సేవా కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆటా ముగింపు వేడుకలను శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు సుధాకర్ పెరికారి, సాంస్కృతిక కార్యక్రమాల సలహాదారు డాక్టర్ పద్మజారెడ్డి, ఆటా ఓవర్సీస్ సమన్వయకర్తలు పి.హరినాథ్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, ఆటా కార్యదర్శి బొమ్మినేని మధు, ఎనుగు లక్ష్మారెడ్డి, పీ కిరణ్, శ్రీనివాస్, టీడీటీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు